ప్రపంచం ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషణ్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి రహిత ప్రభుత్వం రావాలని ప్రజలు 2014లో మోడీకి ఓటేశారని చెప్పారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని బీజేపీ సరిదిద్దిందని చెప్పారు.

అవినీతి ఆరోపణ లేకుండా తొమ్మిదిన్నరేళ్లు పరిపాలించినట్లు తెలిపారు. తమ హయాంలో మత కలహాలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేవన్నారు. భాజపా పాలనలో దేశం మొత్తం శాంతి నెలకొందని
వివరించారు. “ప్రపంచం ముందు పాకిస్థానన్ను దోషిగా నిలబెట్టాం. ప్రస్తుతం తినడానికి తిండి లేక ఆ దేశం భిక్షమెత్తుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో దేశంలో రహదారులు నిర్మిస్తున్నాం. రూ.1.02 లక్షల కోట్లతో తెలంగాణలో రహదారులు నిర్మించాం. బీజేపీ హయాంలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా చేశాం. 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నాం. 13 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించాం. శంషాబాద్ ఎయిర్ ఫోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తయారవుతోంది” అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news