అండర్ – 19 వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి అయిన ఐర్లాండ్ ను ఏ దశ లోనూ కోలుకోకుండా పూర్తి ఆధిపత్యం చేలాయించి.. చిత్తు చేసింది. ఏకంగా 174 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్.. నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పొయి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్ (88), రఘువంశీ (79) ఆది నుంచే దాటిగా ఆడటంతో తొలి వికెట్ కు 164 పరుగుల భాగస్వామ్యం దక్కింది. వీరికి తోడుగా మిడిలార్డర్లు రాజ్ బవ (42), నిశాంత్ సింధు (36), రాజ్ వర్థన్ (38) పరుగులతో రాణించారు.
దీంతో టీమిండియా స్కోరు 300 మార్క్ ను దాటింది. 308 పరుగుల భారీ లక్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టుకు మొదట్లో నే టీమిండియా బౌలర్లు షాక్ ఇచ్చారు. 17 పరుగలు వద్దే మూడు ప్రధాన వికెట్లను కొల్పొయి ప్రమాదం లో పడింది. చివరికి 133 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు సంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌషల్ తంబే రెండు వికెట్లు చొప్పున తీసుకున్నారు. అలాగే విక్కి ఓస్వాల్, రవి కుమార్, రాజ వర్థన్ తలో వికెట్ తీసుకున్నారు.
88 పరుగుల తో రాణించిన ఓపెనర్ హర్నూర్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగ ఈ మ్యాచ్ కు ముందే కెప్టెన్ యశ్ దుల్, వైస్ కెప్టెన్ రషీద్, ఆటగాళ్లు ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ ఐదుగురు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నిశాంత్ సింధు కెప్టెన్ గా వ్యవహరించాడు.