317 GO ప్రకారం కేటాయింపులు జరిగాక ఖాళీగా ఉన్న మరో 60 నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా 3 శాతమని… 10-12 శాతం ఉద్యోగులకు కొంతమేర మాత్రమే ఇతర చోట్లకు వెళుతున్నారన్నారు. అవగాహన లేకే అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు.
పద్దతి ప్రకారం కేటాయింపులు జరిగక పోతే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా? రాష్ట్రపతి ఉత్తర్వుల కు లోబడి కేటాయింపులు చేస్తున్నాం కాబట్టే సంఘాలు ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. 317 GO రద్దు అంటే నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమేనని… ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డు పడడమేనన్నారు.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి 15 లక్షల 62 వేల 9 వందల 12 ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయని… ముందుగా మోడీ గారినీ, కేంద్ర ప్రభుత్వం ను ఆ ఖాళీ పోస్టులు నింపమని భాజపా నాయకులు డిమాండ్ చేయాలని ఫైర్ అయ్యారు. తెలంగాణ లో 7 ఎండ్లలో 1 లక్షా 30 వేల మంది కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు.