కరోనా కల్లోలం..టీమిండియా కెప్టెన్ తో సహా, 5 గురికి పాజిటివ్

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ థర్డ్‌ వేవ్‌.. దాదాపు 99 దేశాలలో కొనసాగుతోంది. అయితే.. తాజాగా వెస్టిండీస్‌ లో జరుగుతున్న అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ టోర్నీలో కరోనా కలకలం రేపింది. టీమిండియా కెప్టెన్‌ యశ్ ధుల్‌ సహా మరో ఐదురుగు ప్లేయర్లకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

దీంతో వరల్డ్‌ కప్‌ నుంచి వారు నిష్ర్కమించారు. ధుల్‌, వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ తో పాటు బ్యాటర్‌ ఆరాధ్య యాదవ్‌, వాసు వాట్స్‌, మానవ్‌ పరాఖ్‌ సిద్ధార్థ్‌ యాదవ్‌ లు కూడా కరోనా బారీన పడ్డారు. దీంతో భారత జట్టులో 11 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. కరోనా పరీక్షలు అనంతరం ఆరుగురు ఆటగాళ్లు ఐసోలేషన్ లోకి వెళ్లారు. దీంతో నిన్న ఐర్లాండ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో నిశాంత్‌ సిద్ధు తాత్కాలిక కెప్టెన్‌ గా వ్యవహరించారు. అయితే.. ఈ మ్యాచ్‌ లో ఇండియా అద్బుత విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news