అధికారంలోకి వస్తే..నాటు కోడి గుడ్లు పంచుతాం : సోము వీర్రాజు

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కేవలం మోడీ ప్రభుత్వ నిధులతో నే అభివృద్ధి జరుగుతుందన్న ఆయన.. సిమెంటును రూ. 330 కి ఎందుకు అమ్ముతున్నారని వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. బిజెపి అధికారంలోకి వస్తే రూ. 200 ఇస్తామని.. పిల్లలకు సరైన కోడిగుడ్లు ఇవ్వలేని పార్టీ అధికారం లో ఉందన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో కోళ్లఫారం పెట్టి నాణ్యమైన నాటు కోడిగుడ్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని భవిష్యత్తు లో పోరాటం చేస్తామని.. కర్నూలు జిల్లా అధ్యక్షుడు బడ్డా శ్రీకాంత్ రెడ్డి పై దాడి కి నిరసనగా ఈనెల 22 న 175 నియోజకవర్గాల్లో ప్రజా నిరసన సభ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలపై దాడి చేస్తే అడిగే దిక్కులేదని.. మసీదులు కట్టడం, టిప్పు విగ్రహ ఏర్పాటు… రాముడి శిరక్షేధనం.. రథం తగలబడడం వంటివి జరిగితే అడిగేవారు లేరని విమర్శించారు.

వైఎస్ విగ్రహానికి ఏమైనా జరిగితే వెంటనే అరెస్టు చేస్తున్నారని.. ప్రజల కోర్కెలు తీర్చడం లో… ఆర్థిక పరిస్థితి ని చక్కదిద్దడం, అభివృద్ధి విషయం లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అగ్రహించారు. రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాయలసీమలో ఎర్రచందనం, ముగ్గురాయి, చాలా ఖనిజాలు ఉన్నప్పటికి… సీఎం లుగా ఇక్కడివారు ఉన్నా అభివృద్ధి మరిచారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news