మిర్యాలగూడ: మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమ సమావేశంలో మున్సిపాలిటీ చైర్మన్ భార్గవ్ పాల్గొని మాట్లాడారు. వీధులలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రతి వీధిలో చెత్త వేసే ఒక పాయింట్ దగ్గర మాత్రమే వేయాలని, మున్సిపాలిటీ సిబ్బంది సూచనలు పాటించాలని ఆయన అన్నారు. పట్టణానికి శుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆయన తెలిపారు.