రాయలసీమ ప్రాంతాల వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విజయవాడకు మరో కొత్త రహదారి నిర్మాణానికి సిద్ధమవుతోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు కొత్త రహదారిపై ఫోకస్ పెట్టింది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే.. రాయలసీమలోని..వెనుకబడిన ప్రాంతాల నుంచి విజయవాడకు కనెక్టివిటీ ఉంటుంది. దీని కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పాదనలపై ఎన్‌హెచ్ ఏఐ సానుకూలంగా స్పందించింది.
రాయలసీమలోని నల్లమల ప్రాంతానికి మాత్రం విజయవాడతో సరైన రహదారి లేకుండా పోయింది. అందుకే రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలను విజయవాడ ప్రాంతంతో మరింతగా అనుసంధానించేందుకు గిద్దలూరు – వినుకొండ రహదారి నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వినుకొండ నుంచి విజయవాడకు ఇప్పటికే ప్రధాన రహదారితో కనెక్టివిటీ ఉంది. గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రోడ్డు వస్తే.. సరిపోతుందని భావిస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ సానుకూలంగా స్పందించి ప్రాజెక్టును ఆమోదించింది.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విజయవాడ నుంచి బెంగళూరుకు ఎక్స్ ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.