యూఏఈ రాజధాని అబుదాబిపై మరోసారి దాడి జరిగింది. బాలిస్టిక్ క్షిపణులతో దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ దాడిని యూఏఈ రక్షణ దళాలు సమర్థవంతంగా అడ్డుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టాలు జరగలేదని.. క్షిపణులు అబుదాబి నగరం అవతల నిర్జన ప్రాంతంలో పడ్డాయని అక్కడి అధికారలు తెలిపారు. అయితే ఇది హౌతి తిరుగుబాటుదారుల పనే అని అధికారిక వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
గతం వారం అబుదాబి ఎయిర్ పోర్ట్ లోని ఆయిల్ ట్యాంకర్లపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులకు, ప్రభుత్వ దళాలకు మధ్య తీవ్రంగా ఘర్షణలు తలెత్తుతున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వర్గాలు యెమెన్ లోని ప్రభుత్వ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో హౌతీ తిరుగుబాటుదారులు యూఏఈ, సౌదీలపై తరుచూ దాడులు చేస్తున్నారు.