వామిక ఫోటోలు ప్రసారం చేయడంపై కోహ్లీ సీరియస్‌ !

-

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ముద్దుల కుమార్తె వామిక ఫోటోలు నిన్న వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. అయితే..ఈ సంఘటన పై టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించారు. దయ చేసి వామిక ఫోటోలను ప్రసారం చేయవద్దంటూ కోహ్లీ ప్రత్యేకంగా కోరారు. కేప్‌ టౌన్‌ లో భారత్‌ – దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్‌ లో విరాట్‌ కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసిన వెంటనే అనుష్క తన తండ్రిని చూపిస్తూ.. చప్పట్లు కొట్టడాన్ని తెలివిగా కెమెరాలో బంధించేశారు.

ఆ ఫోటోలే దాదాపు అన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు, సోషల్‌ మీడియా వేదికలపైకి చేరాయి. దీంతో ఇన్నాళ్లు తమ కుమార్తె ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్న కోహ్లీ దంపతుల గోప్యతకు భంగం కలిగింది. తమ కుమార్తె విషయంలో ప్రైవసీ కావాలని దీన్ని అర్ధం చేసుకుంటారని కోరుతూ గతంలో కోహ్లీ, అనుష్క గతంలోనే కోరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news