RAVIKRISHNA NAVYA SWAMY :పేరెంట్స్ పెళ్లికి నో చెప్పార‌ని స్టేజిపైనే ఏడ్చేసిన సీరియ‌ల్ క‌పుల్..!

-

తెలుగు యాంక‌ర్స్ లోనే టాప్ యాంక‌ర్స్ గా బుల్లితెర‌పై సుమ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక సుమ చేస్తున్న టీవీ షోల‌లో క్యాష్ ప్రోగ్రామ్ కు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎంతో ఇంట్రెస్టింగ్ టాస్క్ ల‌తో పాటూ ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న‌లు వేస్తూ సుమ ఈ షో ద్వారా ఎంతో వినోదాన్ని పంచుతూ ఉంటుంది. ఇక ఈ క్యాష్ ప్రోగ్రాంలో ప‌లువురు బుల్లితెర స్టార్ లు సినిమా స్టార్ లు మ‌రియు సోష‌ల్ మీడియా సెల‌బ్రెటీలు వ‌చ్చి సంద‌డి చేస్తుంటారు.

cash promo

కాగా తాజాగా ఈ షోకు బుల్లి తెర జోడీలు రవికృష్ణ, నవ్య స్వామి, సిద్ధార్థ్ మరియు విష్ణు ప్రియ లు హాజ‌ర‌య్యారు. షోలో సుమ ఇచ్చిన ముద్దుల టాస్క్ ను విష్ణు ప్రియ మ‌రియు సిద్దార్థ్ లు ఎంతో ఎంజాయ్ చేస్తూ క్యూట్ క్యూట్ గా ఫినిష్ చేశారు. ఇక మ‌ద్య మ‌ద్య‌లో సుమ త‌నదైన పంచ్ ల‌తో ఆక‌ట్టుకుంది. ఇక క్యాష్ షోలో సందడి చేసిన ర‌వికృష్ణ‌, న‌వ్య‌స్వామి కూడా ఆక‌ట్టుకున్నారు. అయితే వీరిద్ద‌రికీ ఇంకా పెళ్లి కాలేద‌న్న సంగ‌తి తెలిసిందే.

కానీ ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి మాటీవీలో ఓ సీరియ‌స్ లో భార్య భ‌ర్త‌లుగా న‌టించారు. ఆ సీరియ‌ల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే అదే స‌మ‌యంతలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిన‌ట్టు వార్త‌లు వినిపించాయి. ఇక క్యాష్ షోలో ఇద్దరూ త‌మ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవ‌డం లేద‌ని కంట త‌డి పెట్టుకున్నారు.

ర‌వికృష్ణ న‌వ్య‌స్వామితో మాట్లాడుతూ మొద‌ట న‌న్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావ్ మ‌ళ్లీ ఏమైంది అంటూ న‌వ్య‌స్వామిని ప్ర‌శ్నిస్తున్నాడు. దాంతో న‌వ్వ‌స్వామి అలా చెప్పింది నిజ‌మేన‌ని కానీ ఇప్పుడు త‌న ఫ్యామిలీ ఒప్పుకోవ‌డం లేద‌ని చెబుతూ క‌న్నీళ్లు పెట్టుకుంది. అయితే వీరిద్ద‌రూ ఏడ్చేసింది నిజంగా కాదు. షోలో సుమ ఇచ్చిన ఓ టాస్క్ లో భాగంగా ఇద్ద‌రూ న‌టించి అందులోనే జీవించారు.

Read more RELATED
Recommended to you

Latest news