ఉద్యోగులు మాకు ప్రతి పక్ష పార్టీలు కాదని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కూడా మరోసారి సమావేశం అవుతున్నాం…వాళ్ళ కోసం ఎదురు చూస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు వస్తే సంతోషమని.. ఓపెన్ మైండ్ తో ఉన్నామని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని.. ఏ ఆందోళనలు చేసినా…చర్చలు చేస్తేనే సమస్యలను సామరస్యంగా పరిష్కారం అవుతాయని వెల్లడించారు.
ఉద్యోగులతో చర్చల తర్వాతే ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని.. ఈ విషయం వాళ్లూ కూడా అంగీకరిస్తున్నారని స్పష్టం చేశారు. జీవోల్లోని కొన్ని అంశాల పై వారు సంతృప్తికరంగా లేకపోయినా ఏకపక్షంగా విడుదల చేసిన జీవోలు కావని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేసింది కరెక్టే అని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ఉద్యోగుల అభ్యంతరాలు ఉంటే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని… అన్ని దృష్టిలో పెట్టుకునే 14.29 నుంచి 23 శాతానికి ఫిట్ మెంట్ నిర్ధారించారని గుర్తు చేశారు. అది తప్పు అయితే ప్రభుత్వం అలా చేయదు కదా అని ప్రశ్నించారు.