ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..పాల్గొన్న సీఎం కేసీఆర్‌

-

దేశ వ్యాప్తంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసం గా నిర్వహించారు. అయితే.. వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సిఎం కెసిఆర్ పుష్పాంజలి ఘటించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సిఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు గణతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం పెరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.పలువురు ప్రజాప్రతినిధులు, సీస్ శ్రీ సోమేశ్ కుమార్, డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అటు తెలంగాణ స్టేట్ లోని అన్ని జిల్లాలోనూ కలెక్టర్లు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news