మోడీ చక్రవర్తి అయితే..కెసిఆర్ ఓ సామంత రాజు : రేవంత్ రెడ్డి

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ లో విద్యార్దులు..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్దమని పేర్కొన్నారు.

త్వరలో జైల్ భరో చేద్దామని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు పిలుపు నిచ్చారు. మోడీ..కెసిఆర్ లాంటి నాయకులు దేశాన్ని పట్టి పిడుస్తున్నారని.. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల విధానం మీద అనుమానం వచ్చేలా ప్రధాని కార్యాలయం వ్యవహరిస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి అదానీ, అంబానిలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తొక్కి చంపిన మంత్రిని మోడీ క్యాబినెట్ లో కొనసాగించడం అంటే అర్దం ఎంటి..? అని నిలదీశారు. రైతులను తొక్కి చంపండి అని ప్రొత్సహించడమేనా అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.