ఇంటింట ఫీవర్ సర్వేలో భాగంగా వరంగల్ జిల్లాలో మంగళవారం 25,837 గృహాలను సందర్శించగా..1444 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని, వారికి చికిత్సలందించామని DMHO వెంకటరమణ తెలిపారు. కరోనా జాగ్రత్తలపై ప్రజలంతా తప్పని సరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. చేతులను వీలైనన్నిసార్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోకోని, ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు.