మీకు వచ్చిన డబ్బులు పన్నుకే అయ్యిపోతున్నాయా..? జీతం లో చాలా వరకు ట్యాక్స్ ఏ అవుతోంది అని బాధ పడుతున్నారా..? అయితే మీకోసమే ఈ టిప్స్. మీరు కనుక బడ్జెట్ తో సంబంధం లేకుండా రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వారు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అయితే మరి అది ఎలా సాధ్యమో చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఒకవేళ ఒక వ్యక్తి యొక్క జీతం ద్వారా వచ్చే ఆదాయం రూ.10 లక్షలు అయితే వడ్డీ ఆదాయం రూ.20 వేలు ఉంది. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ కింద చూస్తే పన్ను భారం రూ.9.7 లక్షలకు తగ్గుతుంది కదా.. అయితే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద ఈ బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ వ్యక్తి కనుక నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో డబ్బులని పెడితే రూ.50 వేలు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు.
సెక్షన్ 80 సీసీడీ(1బీ) ద్వారా ఈ ప్రయోజనం ఉంటుంది. దీనితో పన్ను భారం రూ.7.7 లక్షలకు తగ్గింది. అలానే ఈ వ్యక్తి హోమ్ లోన్ లేదా హౌస్ రెంట్ అలవెన్స్ రూపంలో ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌ను మరో రూ.2 లక్షలు దాకా తగ్గించుకోచ్చు. ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.5.7 లక్షలకు తగ్గుతుంది. ఇది ఇలా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.25 వేల వరకు ట్యాక్స్ ని తగ్గించచ్చు.
వీటితో పాటుగా తల్లిదండ్రుల ఇన్సూరెన్స్ ప్లాన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై కూడా రూ.50 వేల వరకు పన్న మినహాయింపు ఉంది. ఇప్పుడు అయితే ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.4.95 లక్షలకు తగ్గింది. అయితే ఐదు లక్షలు ఇన్కమ్ అయితే ట్యాక్స్ ఉండదు. సెక్షన్ 87ఏ కింద పూర్తిగా రిబేట్ వస్తుంది. అందువల్ల రూ.10 లక్షల వార్షిక ఆదాయం ఉన్నా కూడా ట్యాక్స్ ని పే చెయ్యాల్సిన పనే లేదు. ఇలా పది లక్షల జీతం వస్తున్నా ట్యాక్స్ కట్టక్కర్లేదు.