‘సైరా..’ సెట్స్‌లో బాలయ్య సందడి

-

ఖైది నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో వస్తున్న ఈ సినిమా టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ కు నందమూరి బాలకృష్ణ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడట.

ఇద్దరు సీనియర్ హీరోస్ ఓ గంట పాటు మాట్లాడుకున్నారట. సైరా సెట్స్ ను చూసి బాలకృష్ణ ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. ఇక ఈమధ్యనే ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ మొదలు పెట్టాడు బాలకృష్ణ. ఈ ఇద్దరు హీరోలు ఇలా ఒకరి సెట్స్ కు ఒకరు వెళ్లి కలవడం ఫ్యాన్స్ కు భలే థ్రిల్ కలిగిస్తుంది.

వారి మధ్య ఉన్న సఖ్యతను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. వీరెంత చెబుతున్నా సరే మెగా, నందమూరి ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పని గొడవలు పడుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు చూసైనా సరే వారిలో మార్పు వస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news