SALAAR : సలార్ నుంచి బిగ్ అప్డేట్.. శృతి హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “సలార్”. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి అయిందని సమాచారం.

అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన… పోస్టర్లు అలాగే టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా మరో డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇవాళ శృతి హాసన్ బర్త్ డే నేపథ్యంలో ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ఆద్య అనే క్యారెక్టర్ లో శృతి హాసన్ నటిస్తున్న చిత్ర బృందం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news