మంచి అమ్మను చూశాను అని రాయండి..ఎంత గొప్ప ఆనందమో! మీ విజయంలో అమ్మ ఉన్నారు కదూ! అని మీ చుట్టు పక్కల వారు ప్రశంసిస్తే పొంగిపోతారు కదూ! అవును! నాన్నకూ అమ్మకూ మనం ఇచ్చేవి కొన్ని అపురూప కానుకలు మన విజయాలు.. విజయ దరహాసాలు కూడా! అమ్మ వచ్చి కొంగు చాచి అడగదు..నాన్న వచ్చి శాసనం చేసి వెళ్లడు.. అమ్మనాన్నల సంస్కారం అది కాదు.. ప్రేమ అనే ఓ విస్తృత లక్షణం పంచి వెళ్లడం మాత్రమే వారికి తెలిసిన విద్య. ఆ విద్య ను మనం పొంది మళ్లీ లోకానికి కాస్తయిన మంచి చేయగలిగితే చాలు అమ్మానాన్న ఎక్కుడున్నా సంతోషిస్తారు. మీ విజయంలో అమ్మ ఉన్నారు నాన్న ఉన్నారు అన్న భావనే మీకో గొప్ప ఆత్మ విశ్వాస ప్రతీక. అలాంటి చోటు మీరుండే ప్రకృతి మీరుండే పరిసరం ఆనందాలకు నిలయం. అమ్మానాన్నకు వందనాలు చెల్లించండి..మీ జీవితాన్ని సుకృతం చేసింది వారే! హ్యాపీ మార్నింగ్ టు ఆల్
అమ్మా నాన్నలను మన జీవితం నుంచి ఇంకొకరి జీవితం వరకూ ఎలా ఉన్నారో చూడాలి.. ఎలా ఉన్నారు అంటే ఇతరుల బిడ్డలను వారు ఏ విధంగా చూస్తున్నారు..తమ బిడ్డలను ఏ విధంగా ప్రేమిస్తున్నారు అన్నది చూడాలి.ప్రేమైక తత్వం ఒకటి అలవర్చుకుని జీవితాన ప్రయాణించడం అమ్మానాన్నలు మాత్రమే ఇస్తారు. మంచి పెంపకం అంటారు అంటే అర్థం ఏంటి నీ తల్లీ నీ తండ్రి ఇతరులకు ఆదర్శం. నీకు దైవ సమానం అని! అలాంటి తల్లీ తండ్రీ వాకిట నేనున్నాను అని ఎవ్వరు చెప్పుకున్నా వారి జీవితాలను ధన్యమే..అర్థవంతమే!
అమ్మానాన్నలను గురు తుల్యం చేసి చూడండి.. మీకు గొప్ప భావం ఒకటి ఎదురుపడుతుంది.అమ్మానాన్నలు మన సంస్కృతికి వారథులు అయి ఉండాలి. మన చుట్టూ ప్రకృతికి వాళ్లే సిసలు ప్రతినిధులు..బంగారు కలలు వాళ్ల దగ్గర ఉన్నాయి పిల్లలూ మీరు వెళ్లి తీసుకోండి అని రాశారొకరు. అవును! వారి కలల బంగారాలను మనం ప్రేమిస్తూ పోవాలి..ఆరాధిస్తూ రావాలి. అవును! అమ్మానాన్నలకు గుడి అక్కర్లేదు.. మీరు పెద్ద సాహసం చేస్తున్నారు. వాళ్ల కోసం మీరు కేటాయించే కొన్ని నిమిషాలే వారికి అమృత తుల్యాలు.. స్వర్గలోక పరిచయాలు ఆ క్షణాలు.
అమ్మా నాన్నలను నేలను నింగిని కలిపి ఉంచే బంధాలు.. అమ్మ ను నేల అని అంటారు.. నాన్న ను నింగితో పోల్చి ఆ హరివిల్లుల ఆకాశం బిడ్డల చేతికి అందించే వేళ పొంగిపోతారని చెబుతారు. వానలు కొన్ని నేలను నింగిని కలిపి ఉంచే బంధాలు.. పిల్లల నవ్వుల వెలుగులు కొన్ని నింగినీ నేలనూ కలిపి ఉంచే బంధాలు..అమ్మానాన్న మన జీవితాలకు ఆలంబనలు అయి ఉన్నారు. మీరు ప్రేమించండి..గొప్ప శక్తి మీకు వారు ఇస్తారు..మీరు ప్రేమనే ముడుపు కట్టండి మీ వరాలు తప్పక తీరుస్తారు.
ఈసారి అమ్మానాన్న కైలాస శిఖరాల చెంత ఉన్నారు.. బిడ్డలు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.బిడ్డలను ప్రేమించే అమ్మానాన్న ఆ పార్వతీ పరమేశ్వరులు..బిడ్డల ఉన్నతి కన్నా గొప్పది ఆ తల్లిదండ్రులకు ఏముందని కనుక ఆ ఓంకార రూపం మనకు ఆదర్శం. అమ్మా నాన్న ప్రకృతికి ప్రతిరూపాలు.. ప్రేమకు ప్రతిరూపాలు.. ఆనందాలకు కూడా ప్రతిరూపాలు వారే ప్రతీకలు వారే!