దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు : బండి సంజయ్ కు హరీష్ సవాల్

-

బండి సంజయ్‌ పై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు..దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు అంటూ బండి సంజయ్ కి సవాల్‌ విసిరారు. దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని… బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేత‌లు దొంగ జ‌పం చేస్తున్నారని.. దొంగే దొంగ అంటున్నారు… అస‌లు ఉద్యోగాలు ఇచ్చింది ఎవ‌రు…? ఇవ్వంది ఎవరు..? అంటూ రెచ్చి పోయారు.

నోటిఫికేష‌న్లు ఇచ్చింది ఎవ‌రు.. నోటిఫికేష‌న్లు ఇవ్వనిది ఎవ‌రు..? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా….? అని నిలదీశారు. బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలి.. గాలి మాట‌లు కాదు..ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి…మీ బిజెపి హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నోటికి వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు అవుతుందా.. నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ట్లు అవుతుందా… అని నిలదీశారు. బీజేపీ పాల‌న‌లో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ ప‌డుతుందో బండి సంజ‌య్ తెలుసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news