ఆ రైతుకు మండుకొచ్చింది ఏం చేశాడంటే?

-

పండ్ల వ్యాపారం చేస్తే జీవితం న‌డుస్తుంది
ఇంటికి నాలుగు రూపాయ‌లు చేరుతాయి
అందుకు న‌ల్ల‌మ‌ల అడ‌వే సాక్షి
పాపం ఆ రోజు కూడా అత‌డు ఆ పంట‌నే న‌మ్ముకున్నాడు
పండ్ల‌ను అమ్ముకుని ఇంటికి త్వ‌రిత‌గ‌తిన చేరుకోవాల‌ని
అనుకున్నాడు కానీ. అత‌డికి అవ‌మానం ఎదురైంది
క‌న్నీటి ఊట‌లో ఉండిపోయాడు.. ఆ సంద‌ర్భం ఎలా ఉందంటే?

నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామానికి చెందిన రైతు గోప‌య్య క‌థ ఇది.బొప్పాయి ప‌ళ్ల వ్యాపారం చేస్తేనే త‌న‌కు కాస్తో కూస్తో కూడూ గుడ్డా ద‌క్కేది.పండిన పండ్ల‌ను ప్ర‌తిరోజూ ఆర్టీసీ బ‌స్సులో ప‌ట్నానికి పోయి అమ్ముకుని వ‌స్తే తిండి గింజ‌లు ద‌క్కేది.కానీ ఆ రోజు సీన్ రివ‌ర్స్ అయింది.కొల్లాపూర్ ప‌ట్ట‌ణానికి పోతేనే ఆయ‌న కష్టంకు ఫ‌లం ద‌క్కేది అని తాను నెత్తీ నోరూ మొత్తుకుంటూ చెబుతున్నాడు.ఇంత‌కూ ఆ రోజు ఏమ‌యింది?

నిన్న‌టి వేళ ఆ రైతు ఆర్టీసీ బ‌స్సు రోజూ ఎక్కిన విధంగానే ఎక్కాడు.. ల‌గేజ్ టికెట్ కూడా క‌డ‌తాన‌ని చెప్పాడు. కానీ ఆ ఆర్టీసీ డ్రైవ‌ర్ డ‌బ్బులు చెల్లింపు స‌రే త‌న‌కు ఫ్రీగా బొప్పాయి ప‌ళ్లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. లేదంటే దించేస్తాన‌ని అన్నాడు.పాపం ఆ రైతు అత‌డి మాట రోజూ వింటూనే ఉన్నాడు.. కానీ ఎందుక‌నో ఈ సారి మాత్రం పండ్లు ఇవ్వ‌లేక‌పోయాడు. అది మ‌న‌సులో ఉంచుకుని ఆ డ్రైవ‌ర్ నిన్న‌టి వేళ పండ్ల బుట్ట‌ల‌తో బ‌స్సు ఎక్కేందుకు వీల్లేద‌ని చెప్పి ప‌ట్టుబ‌ట్టాడు. బండి లాగించేశాడు. ఇక గోప‌య్య అక్క‌డే ఉండి క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. తన‌కు దిక్కెవ‌రు అని ఆవేద‌న చెందాడు. నేను దేశానికి అన్నం పెడుతున్నాను న‌న్ను గౌర‌వించ‌డం ఇదేనా అని మ‌థ‌న ప‌డ్డాడు.

ఆ దారెంట వెళ్లే బస్ అదొక్క‌టే కావ‌డంతో వేరే దారి లేక వేరే ర‌వాణా సౌక‌ర్యం కూడా లేక తానున్న న‌ల్ల‌మ‌ల అడ‌వికి దండం పెట్టి అక్క‌డే ఉండిపోయాడు. క‌ద‌ల్లేదు. బ‌స్సు కొల్లాపూర్ కు వెళ్లి తిరిగి త‌న ఊరికి చేరుకున్నాక అదే దారిలో అలానే ఉండిపోయి పండ్ల బుట్ట‌లు అడ్డుపెట్టి తాను రోడ్డుపైనే బైఠాయించి నిలుప‌ద‌ల చేశాడు. ఆ విధంగా రోడ్డుపై రెండు నుంచి మూడు గంట‌ల పాటు నిలుపుద‌ల చేశాడు.

మారేడు మాన్ దిన్నె రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు కూడా అయిన చటమోని గోపయ్య త‌న క‌ష్టం ఇత‌రులెవ్వ‌రికీ రాకూడ‌ద‌ని బాధ‌ప‌డుతూ త‌న‌దైన నిర‌స‌న తెలిపాడు. దీంతో విషయం కాస్త న‌వీన్ రెడ్డి అనే ఓ నెటిజ‌న్ ద్వారా ఎండీ స‌జ్జ‌నార్ కు చేరింది. అంతే తాము ప‌రిశీలించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ట్విట‌ర్ ద్వారా తెలిపారు.దీంతో త్వ‌ర‌లోనే ఈ సమ‌స్య ప‌రిష్కారం అవుతుంది అని ఆశిద్దాం. ఇంత చేసినా ఆ రైతు ఆర్టీసీని ఒక్క మాట అనలేదు.. త‌న‌కు ఆ సంస్థ అంటే గౌర‌వం ఉంద‌నే చెప్పాడు. ఈదేశానికి వీరు క‌దా కావాలి.. క‌ష్ట పెట్టినా కూడా మ‌న్నించే మ‌న‌స్సు గోప‌య్య‌ది.

Read more RELATED
Recommended to you

Latest news