రఘురామ పిటిషన్‌ : జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు

-

రఘురామపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులపై హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ పై తాజాగా విచారణ జరిగింది. అన్యాయంగా నమోదు చేసిన.. దేశ ద్రోహంతో పాటు ఇతర కేసులను కొట్టివేయాలని ఈ సందర్భంగా రఘురామ లాయర్‌ కోర్టుకు తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి.. ప్రభుత్వం.. సీఐడీ అధికారులు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. అయితే.. సీఐడీ ఏడీజీపై పిటీషనర్‌ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య తెలిపారు.

పూర్తి స్థాయి విచారణ అనంతరమే రఘురామపై కేసులు పెట్టామని చెప్పారు. ఇక ఇరువురు వాదనలు విన్న హైకోర్టు.. ఈ పిటీషన్‌ లో ఏపీ సర్కార్‌ తో పాటు సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌ కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న హొం శాఖ ముఖ్య కార్యదర్శి, అడిషనల్‌ డీజీ సీఐడీ, మంగలగిరి సీఐడీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో కు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ సోమవారం ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news