వైద్య, ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్లలో ఉద్యోగు బదిలీలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల చివరి వరకు బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల విషయమై డీహెచ్, డీఎంఈ, ఏపీవీవీపీ, ఆయుష్ కమిషనర్, ఇతర అధికారులతో వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ సమీక్ష చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఆన్ లైన్ లో బదిలీలు చేపట్టేందుకు ప్రత్యేకంగా వెబ్ అప్లికేషన్ ను రూపొందించారు. రాష్ట్ర, రీజనల్, జిల్లా కమిటీల వారీగా అధికారులు లాగిన్ అవడానికి వీలు కల్పించారు. అలాగే.. వైద్య, ఆరోగ్య శాఖలో ఏకంగా 11,425 పోస్టుల భర్తీకి గత సంవత్సరం నవంబర్ లో ప్రభుత్వం నోటీఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి ప్రక్రియ ముమ్మరం కొనసాగుతోంది. కొన్ని పోస్టులు ప్రత్యక్షంగా, మరికొన్ని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.