బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా.. కెనడియన్ ప్రధాని జస్టిస్ ట్రుడో పై ఫైర్ అయ్యారు. 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు ట్రుడో మద్దతు ఇచ్చాడు అనే విషయాన్ని ఆమె గుర్తు చేసింది. కెనడా ప్రధాని భారతీయ నిరసనకారులను ప్రోత్సహిస్తున్నాడు.. ఇప్పుడు తన దేశంలో రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు.. ఎందుకంటే నిరసనకారులు వారి భద్రతకు ముప్పు గా ఉన్నారు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అని ఆమె ఫైర్ అయ్యింది. 2020లో జస్టిస్ ట్రుడో భారతదేశంలో… రైతుల నిరసన కు తన మద్దతును అందించాడు.
“రైతుల నిరసన గురించి భారతదేశం నుంచి వస్తున్న వార్తలపై నేను మాట్లాడాలి. ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబం అలాగే స్నేహితుల కోసం ఆందోళన చెందుతున్నాము. మీలో చాలా మందికి ఇది వాస్తవం అని మాకు తెలుసు. శాంతియుత నిరసన కారుల హక్కులను కాపాడేందుకు కెనడా ఎప్పుడూ అండగా ఉంటుంది. మేము అనేక మార్గాల ద్వారా భారతీయ అధికారులను సంప్రదించాము. మనమందరం ఒక తాటిపైకి రావాల్సిన తరుణమిది. ” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై తాజాగా కంగనారనౌత్ కౌంటర్ ఇచ్చింది.