దేశంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదని కేసీఆర్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నిప్పులు చెరిగారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని.. రెండేళ్లలో దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో పరివర్తన రావాలని.. అందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని కేసీఆర్ అన్నారు. దేశంలో విప్లవం రావాలని కేసీఆర్ అన్నారు. మేం ఎంతవరకు మౌనంగా ఉండాలి.. ఇకపై మౌనంగా ఉండలేము అని కేసీఆర్ అన్నారు. నోరు మూసుకుని కోర్చేలేమంటూ స్పష్టం చేశారు. పనికి రాని ప్రభుత్వాన్ని, నాయకులను గద్డె దించాలని పిలుపునిచ్చారు. గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని.. ఆ మార్పు కోసం కేసీఆర్ గా.. ఈదేశ బిడ్డగా నా బాధ్యత నిర్వహిస్తానని వెల్లడించారు. దేశంలో మార్పు రావడానికి ప్రణాళికను త్వరలోనే బయటపెడుతామని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ స్థానాలు తగ్గబోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి ఉన్న ఆదరణ తప్పకుండా తగ్గుతుందని.. ఇది 2024 లో బీజేపీ పార్టీకి పతనం అని అన్నారు.
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం… దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తాం- సీఎం కేసీఆర్
-