ఒకప్పుడు 90-100 ఏళ్ల వరకూ ఉక్కులాగా ఎలాంటి జబ్బులు లేకుండా బతికినవాళ్లు కూడా ఉన్నారు. దానికి కారణం..మంచి ఆహారం, సమయానికి నిద్ర. మారుతున్న కాలంతో పాటు మనం ఈ రెండింటికి దూరం అయిపోయాం. నిద్ర లేచే సమయం ఇలా అన్ని విషయాల్లో మార్పులు వచ్చాయి. వీటితో పాటు వయసుతో సంబంధం లేకుండా అనేక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే రొజూ తెల్లవారు జామున నిద్ర లేవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈరోజుల్లో తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు ఎవరికీ లేదు. కానీ తెల్లవారుజామున నిద్రలేవటం వల్ల ఎంత మంచిదో చూద్దాం.
ఉదయాన్నే నిద్ర లేవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో శరీరంలో విడుదల అయ్యే హార్మోన్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి.ఉదయం శరీరానికి తగిలే చల్లని గాలి ఆహ్లాదాన్ని ఇస్తుంది. సూర్యోదయ కిరణాలు శరీరానికి డీ విటమిన్ ను అందిస్తుంది. తెల్లవారు జామున నిద్ర లేచి.. వెంటనే నీరు తాగడం వలన 2 సార్లు మల విసర్జన చేయడానికి సమయం ఉంటుంది. రోజుకు రెండుసార్లు మోషన్ అవటం వల్ల దాదాపు ఎలాంటి సమస్యలూ ఉండవూ. పేగులు శుభ్రపడతాయి. నిద్ర ఆలస్యంగా లేస్తే.. త్వర త్వరగా పనులు చేసుకోవాలంటే హడావిడిలో ఒకసారి మలవిసర్జన చేసి పనులలోకి వెళ్ళిపోతాం. పేగులలో ఇంకా బయటకి రావాల్సిన మలం ఉండిపోతుంది. దీంతో పేగులకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ.తెల్లవారి జామున నిద్ర లేచి వ్యాయామం, యోగ వంటివి చేయడం వలన శరీరం ఫిట్ గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం.
తెల్లవారు జామున నిద్రలేచేవారు రోజంతా యాక్టివ్ గా ఉంటారు. త్వరగా లేవడం వలన శరీరం బాగా అలసిపోయి.. రాత్రి త్వరగా నిద్రపోతాం. ఉదయం ఏకాగ్రత బాగా ఉంటుంది. మెదడు ఉదయం సమయంలో అత్యంత వాంఛనీయ స్థాయిలో ఉంటుంది.ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకునేందుకు సరైన సమయం ఉంటుంది. తెల్లవారు జామున నిద్ర లేచే అలవాటుని పెద్దలు పిల్లలకు నేర్పించాలి. ఉదయం 5 గంటల సమయంలో లేచి రాత్రి 8 గంటలకు నిద్రపోయే అలవాటు చిన్నపిల్లలకు నేర్పిస్తే..ఆరోగ్యానికి చాలా మంచిది.
మీరు కూడా పొరపాటున్న ఒక్కేసారి కాస్త ఎర్లీగా నిద్రలేస్తే..అరే ఏంటి ఈ రోజు ఇంత సమయం ఉందే అనిపిస్తుంది. మనం లేచే సరికే..సగం రోజు అయిపోతుంటే…లేచినప్పటి నుంచి హడావిడీ…టైం సరిపోవడం లేదని మళ్లీ మనమే అనుకుంటాం. నైట్ షిఫ్ట్ చేసేవాళ్లకు ఎలాగూ సాధ్యం కాదు..మిగిలనవారు అయినా..తెల్లవారుజమున 5-6 గంటలకే నిద్రలేవటం అలవాటు చేసుకోండి మరీ.!