ఏమంటా అన్నారో తెలియదు గాని…రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేసిన దగ్గర నుంచి తెలంగాణ రాజకీయాలు…ఇప్పుడు అదే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. వాస్తవానికి రాజ్యాంగం మార్చే శక్తి కేసీఆర్కు లేదు…కాకపోతే రాజకీయంగా దేశంలో హైలైట్ అయిపోవాలి…ఇంకా అందరూ తన మాటల గురించి చర్చించుకుంటారని అనుకున్నట్లు ఉన్నారు. కేసీఆర్ అనుకున్నట్లుగానే ఇప్పుడు రాజ్యాంగం మార్చడం ఏంటి అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

అయితే ఈ అంశంపై కేసీఆర్పై విమర్శల వెల్లువ కొనసాగుతుంది..ప్రత్యర్ధులు అనూహ్యా రీతిలో కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…కేసీఆర్పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…కేసీఆర్ వ్యాఖ్యలని ఖండించారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని కేసీఆర్పై ఫైర్ అయ్యారు.
భూస్వాములు, అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉందని, అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని, కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. అటు బీజేపీ కూడా రెండు రోజులు దీఖలు చేయనుంది.
అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి.. కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే కుదరదని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు.. కంత్రీ చంద్రశేఖరరావు అని డీకే అరుణ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ భిక్షతోనే తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ మాట్లాడారు. ఇలా ప్రతిపక్షాలు కేసీఆర్ మతలపై ఫైర్ అవుతున్నాయి. అయితే రాజ్యాంగం విషయంలో టీఆర్ఎస్ నేతలు దగ్గర నుంచి స్పందన రావడం లేదు. ఇక ఇదంతా కేసీఆర్ కావాలనే చేస్తున్నట్లు కనిపిస్తోంది..రాజ్యాంగం గురించి మాట్లాడితే రచ్చ జరుగుతుందని ఊహించే కేసీఆర్ అలాంటి మాటలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాజకీయం కోసం కేసీఆర్ ఎంత దూరమైన వెళ్ళేలా ఉన్నారు.