సీఎం జగన్‌ పై “బీమ్లా నాయక్‌” నిర్మాత సంచలన వ్యాఖ్యలు !

-

కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలు చాలా వాయిదా పడ్డాయి. ఇక కరోనా థర్డ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. ఒక్కో సినిమా తమ రిలీజ్‌ డేట్స్‌ ను అనౌన్స్‌ చేసేస్తున్నాయి. పలువురు మేకర్స్‌ తమ సినిమాలకు గాను కొత్త రిలీజ్‌ డేట్లను కూడా ప్రకటించేశారు. అయితే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన భీమ్లా నాయక సినిమా విడుదలపై మాత్రం అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే.. నిన్న డిజే టిల్లు ట్రైలర్‌ ఫంక్షన్‌ లో బీమ్లానాయక్‌ నిర్మాత నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భీమ్లా నాయక్‌ విడుదలకు గాను రెండు తేదీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్‌ 1 వ తేదీన ఈ మూవీని విడుదల చేయాలని అనుకుంటున్నామని.. అయితే.. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ని అడిగితే బాగుంటుందని చెప్పారు. ఆయన నిర్ణయం పైనే భీమ్లా నాయక్‌ విడుదల ఆధారపడి ఉందని చెప్పారు. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్, రాత్రి కర్ఫ్యూలను ఎత్తేస్తేనే భీమ్లా నాయక్‌ విడుదల అవుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news