ఢిల్లీ : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ) పై ఆగంతకుల కాల్పులు జరిపారు. ఈ సంఘటన మీరట్ లో చోటు చేసుకుంది. ఈరోజు (యూపీ) మీరట్, కిథౌర్లో జరిగిన ఎన్నికల కార్యక్రమం లో పాల్గొన్నారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు ఆగంతకులు.
అయితే ఈ కాల్పుల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కు ఎలాంటి ప్రాణ హాని జరుగలేదు. దీంతో అసద్ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరొక వాహనం లో ఢిల్లీ బయలు దేరారు అసదుద్దీన్ ఒవైసీ. ఇక ఈ కాల్పుల సంఘటన పై స్వయంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. మీడియాకు వివరించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న యూపీ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
I was leaving for Delhi after a poll event in Kithaur, Meerut (UP). 3-4 rounds of bullets were fired upon my vehicle by 2 people near Chhajarsi toll plaza; they were a total of 3-4 people. Tyres of my vehicle (in pic) punctured, I left on another vehicle: Asaduddin Owaisi to ANI pic.twitter.com/ksV6OWb57h
— ANI (@ANI) February 3, 2022