క్రికెట్ ఫ్యాన్స్ కు ఓ ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ కు క్యాన్సర్ మహమ్మారి సోకింది. సాధారణ చెక్ అప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన తనకు వైద్యులు ఆ విషాద వార్త చెప్పినట్లు క్రిస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. కాగా.. గత సంవత్సరం ఆగస్టు మాసంలో క్రిస్ కెయిర్న్స్ కు గుండెపోటు వచ్చింది.
ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స నిర్వహించిన సమయంలో.. ఆయన పక్షవాతానికి గురయ్యాడు. వెన్నెముక కూడా బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన అనంతరం కోలుకున్నాడు. అయితే.. తాజాగా క్రిస్ కు క్యాన్సర్ వ్యాధి సోకింది. దీంతో.. ఆయనకు చికిత్స తీసుకుంటున్నాడు. కాగా.. క్రిస్ కెయిర్స్న్ 2008 సంవత్సరంలో న్యూజిలాండ్ జట్టుకు అలాగే.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక ఇప్పటికే టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్ బారీన పడిన సంగతి తెలిసిందే.