సీఎం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెనుదూమారాన్నే రేపిన సంగతి తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల తన దైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ మోడీ గారిని కడుగుతా, తోముతా, దేశంలో భూకంపం తెప్పిస్త అన్న దొరగారు..మోడీ హైదరాబాద్ కు వస్తే ఎందుకు కలవలేదు? అని చురకలు అంటించారు.
బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని మోడీకి ఎదురుపడి ఎందుకు అడుగలేదు? బండ బూతులు తిట్టిన నోటితో బాగున్నారా అని అడుగలేక పోయారా ? అని నిలదీశారు షర్మిల. చీరుతా అన్న చేతులతో నమస్కారం పెట్టలేకపోయారా? పోయినుంటే మోడీ, KCR ఢిల్లీ దోస్తానీ మరోసారి బయటపడుతదని పోలేదా? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు షర్మిల. “అందుకే జ్వరం వంక పెట్టుకొని డుమ్మా కొట్టారా? సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు పోని పాపాన్ని కడుక్కోవటానికి ఈ రోజు యాదాద్రి యాగానికి వెళ్ళారా? బాగుంది దొరగారు మీ జ్వర రాజకీయం” అంటూ షర్మిల సెటైర్లు పేల్చారు.