సింగరేణి జోలికి వస్తే.. తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలుపెడతాం : తలసాని వార్నింగ్

-

సింగరేణి జోలికి వస్తే.. తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలుపెడతామని కేంద్రానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని.. పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ అని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారని.. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు అని నిలదీశారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుందని.. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్నారన్నారు.

సమతామూర్తి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు ప్రధానికి లేదని.. బీజేపీ సిద్ధాంతమే విభజించు, పాలించు. మనుషులను కులాలు, మతాల పేరుతో విభజించారని ఫైర్ అయ్యారు. ప్రధానికి భాద్యత ఉండాలి. భాద్యత లేకుండా మాట్లాడుతున్నారని.. యూపీ ఎన్నికల గురించే ధార్మిక కార్యక్రమంలో మాట్లాడారన్నారు. తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోందని.. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయక ముందే మండలాలు లాక్కున్నాడని అగ్రహించారు.

తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు. సింగరేణి వంటి పెద్ద సంస్థలు అమ్మేస్తున్నారని.. ఏడున్నర సంవత్సరాల్లో ఆయన ఆయన డ్రెస్ కోడ్ తప్ప దేశ ప్రజలకు ఏమి చేయలేదన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ప్రతినిధిగా ఉంటే సరిపోతుందని.. ఏడున్నర సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం చేసారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news