దేశ రాజకీయాల్లో మార్పులు కేసీఆర్ తోనే ప్రారంభం అవుతాయి… తలసాని సంచలన వ్యాఖ్యలు

-

పార్లమెంట్ లో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన మోదీ.. అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు విభజన చట్టం గురించి ఎందుకు వచ్చిందని.. ఇది పొలిటికల్ డ్రామా అంటూ.. తలసాని విమర్శించారు. ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంగా లేదని… మేమేం ఏదైనా చేయవచ్చని అనుకుంటుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా లేని సమయంలోనే రాజకీయంగా మార్పులు వస్తాయని తలసాని అన్నారు. ఇది చరిత్ర చెబుతోందని.. రాబోయే కాలంలో అదే జరుగుతుందని అన్నారు.

minister talasani srinivas yadav fires on bjp
minister talasani srinivas yadav fires on bjp

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మార్పలు వస్తాయన్నారు. రాబోయే 5 రాష్ట్రాల్లో బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని తలసాని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుందని.. అఖిలేష్ సీఎంగా గెలుస్తారని జోస్యం చెప్పారు. ఆ భయంతో బీజేపీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. దేశ రాజకీయాలు కేసీఆర్ తో ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు. మేం కూడా ఈ దేశంలో భాగస్వాములమే అని..దేశానికి నష్టం జరుగుతుంటే ఊరుకోమని అన్నారు. సింగరేణిని ముట్టుకుంటే ఏం అవుతుందో.. బీజేపీకి తెలుస్తుందని వా

ర్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news