ప్రధాని మోదీ నిన్న రాజ్య సభలో కాంగ్రెస్ ను విమర్శిస్తూ.. ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రధాని వ్యాఖ్యలపై టీాఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతోంది. తాజాగా ఈరోజు బీజేపీ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని పిలుపు ఇచ్చింది. మరోొవైపు తెలంగాణ మంత్రులు ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా నిరసన, ఆందోళనలకు పిలుపునిచ్చింది.
ప్రస్తుతం పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జరుతున్నాయి. నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఢిల్లీలో తప్పుపట్టారు కాంగ్రెస్ ఎంపీ కే. కేశవరావు. ప్రధాని వ్యాఖ్యలు బాధించాయన్ని అన్నారు. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే… కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే బిల్లుకు మద్దతు తెలిపాయని అన్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు నిరసనలు తెలిపారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రంజిత్ రెడ్డి, కేశవరావు, మాలోత్ కవిత, సంతోష్, నామా నాగేశ్వర్ రావు, వెంకటేష్ నేతకానితో పాటు మరికొంత మంది టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు.