హిజాబ్ వివాదం: విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసిన కర్ణాటక హైకోర్ట్

-

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ‘హిజాబ్’ వివాదం. కర్ణాటకలో హిజాబ్ వివాదం కోనంసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు కర్ణాటక హైకోర్ట్ విచారణ జరిపింది. ఇది రెండో రోజు విచారణ. అయితే హిజాబ్ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేశారు జస్టిస్ క్రిష్ణ దీక్షిత్. ఈ నిర్ణయంపై ఇరు వర్గాలు అసంత్రుప్తి వ్యక్తం చేశాయి. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని రెండు వర్గాలు కోరాయి. విద్యార్థుల భవిష్యత్తు ద్రుష్ట్యా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తిని కోరాయి.

ఈరోజు పిటిషనర్ల తరుపున న్యాయవాది, ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదించారు. వాదనలు వాడీవేడిగా నడిచాయి. పాఠశాలల్లో హిజాబ్ పై బ్యాన్ ఎత్తివేయాలని కోరారు పిటిషనర్ల తరుపున వాదిస్తున్న న్యాయవాది. ఇదే వేళ పాఠశాలల్లో ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది తన వాదనలను వినిపించారు.

మరోవైపు కర్ణాటకలో బెంగళూరు నగరంలోని పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, విద్యాసంస్థల నుండి 200 మీటర్ల పరిధిలో ఏ రకమైన సమావేశాలు, ఆందోళనలు లేదా నిరసనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news