తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు అయ్యారు. గురువారం అర్ధరాత్రి సిఐడి అధికారులు అశోక్ బాబు ను అరెస్టు చేశారు. అశోక్ బాబు ఉద్యోగ సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని పేర్కొంటూ సీఐడీ ఇప్పటికే అభియోగాలు నమోదు చేసింది. పదోన్నతి విషయంలో విద్యార్హతగా చూపించారని అశోక్ బాబు పై చాలా ఆరోపణలు వచ్చాయి.
దీంతో సిఐడి అధికారులు గురువారం అర్థరాత్రి ఆయన ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏ సి టి ఓ పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక అశోక్ బాబు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. ఎమ్మెల్సీ ని అరెస్టు చేయడంపై అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ విషయంలో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని… అర్ధరాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. జగన్ సర్కార్ చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు.