వీళ్లు మృత్యుంజయులు రా బుజ్జీ…. రైలుకింద, కారు కింద పడినా ఏం కాలేదు..!

-

టైం బాలేకపోతే..అరటితొక్కమీద కాలు వేసి కూడా చనిపోతారు..అదే టైం బాగుంటే రైలు కిందపడినా తిరిగి లేచి రావొచ్చు అంటుంటారు. కానీ ఇది సామెతకే పరిమితం కాలేదు. నిజంగా ఒక అతను రైలు కింద పడ్డాడు..మొత్తం రైలు అతని మీద నుంచే వెళ్లింది..అయినా మనోడికి ఏం కాలేదు. అలాగే వేరే ఘటనలో కారు వృద్ధురాలిని రెండు సార్లు ఢీ కొట్టింది. అయినా ఏం కాలేదు. ఈ రెండు వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీడు మగడ్రాబుజ్జి అన్నట్లు..వీళ్లు మృత్యుంజయులా అంటూ నెజిటన్లు కమెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఘటనలు ఎక్కడ జరిగాయో చూద్దాం..

ఇవి రెండూ చెప్పాలంటే విషాద ఘటనలే. ఇలాంటివి ఎప్పుడూ జరగకూడదు అని మనం కోరుకుంటాం. కానీ దురదృష్టం కొద్దీ అప్పుడప్పుడూ జరిగేస్తుంటాయి. గొప్ప విషయం ఏంటంటే రెండు ఘటనల్లోనూ బాధితులకు ఏమీ కాలేదు. కనీసం చిన్న గాయం కూడా కాలేదు. అందుకే వీటిని అద్భుతాలుగా నెటిజన్లు చెబుతున్నారు.

మొదటి వీడియో

ఈ వీడియోని సీనియర్ ఎడిటరైన రాజీవ్ చోప్రా ట్విట్టర్ లోని తన అకౌంట్ @Raajeev_Chopra లో పోస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లో జరిగింది. ఓ యువకుడు పట్టాల మధ్యలో అపస్మారక స్థితిలో పడివుండగా… అతని పై నుంచి గూడ్స్ ట్రైన్ వెళ్లింది. కానీ అతనికి ఏమీ కాలేదు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆ రైలు పై నుంచి వెళ్లినప్పుడు అతన్ని చూస్తూ కూడా స్థానికులు ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి ఎదురైంది. రైలు వెళ్లిపోయాక అతన్ని లేపి, కాపాడారు.

అతని పేరు దాల్చంద్ మహవార్, వయసు 27 సంవత్సరాలని తెలిసింది. గంగాపూర్ నగరంలోని… నాసియా కాలనీకి చెందిన అతను మద్యం తాగి రైలు పట్టాలు దాటుతూ పట్టాల మధ్యలో పడిపోయాడట. అతన్ని టూవీలర్ పై గంగాపూర్ సిటీ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతనికి చిన్న గాయం కూడా అవ్వలేదని వైద్యులు తెలిపారు.

రెండో వీడియో:

రష్యా పరిధిలోని టాటార్స్ తాన్ లో ఈ ఘటన జరిగింది. అక్కడి జెలెనోడోల్స్క్ నగరంలో 77 ఏళ్ల మహిళ భారీగా మంచు ఉన్న ప్రాంతంలో నిలబడి ఉంది. అదో పార్కింగ్ స్పాట్. అక్కడ తన కారును పార్క్ చెయ్యాలనుకున్న ఓ వ్యక్తి రివర్సులో వెనక్కి నడిపారు. పొగ మంచు వల్ల ఆ వ్యక్తికి పెద్దామె కనిపించలేదు.

కారు నడుపుతూ వెనక్కి వచ్చిన అతను ఆమెను చూసుకోకుండా గుద్దేశాడు. దాంతో ఆమె మంచులో పడిపోయింది. కారు ఆమె పై నుంచి వెనక్కి వెళ్లింది. తిరిగి ఆ వ్యక్తి కారును ముందుకు నడిపి… మళ్లీ వెనక్కి నడిపారు. రెండోసారి కూడా కారును ఆమె పైనుంచి వెనక్కి నడిపారు. ఆ తర్వాత కారును ముందుకు నడిపి… కారు దిగి… ముసలామె దగ్గరకు వచ్చి ఆమెను పైకి లేపారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తికి 64 ఏళ్లు. ముసలామెను ఆయన ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఆమెకు ఏమీ కాలేదని చెబుతూ డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మంచువల్లే ఆమెకు ఏమీ కాలేదేమో అని భావించారు.

కారు రెండుసార్లు ఢీకొట్టినా, రైలు మొత్తం పై నుంచి వెళ్లినా ఏమీ కాకపోవడం అంటే గొప్పవిషయమే..ఇంకా బతికలాని రాసి ఉంది అందుకే వారికి ఏం కాలేదంటున్నారు కొందరు నెటిజన్లు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news