టీఆర్‌ఎస్ పార్టీ నుండి లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్.. అభ్యర్థులకు బీపామ్ కూడా ఇచ్చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 16 మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. కాగా కొత్త వారికి చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వార్ వన్ సైడ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాల పైకి దండెత్తాడు. ఢిల్లీ గులాంలు కావాలా? తెలంగాణ గులాబీ కావాలా? అనే నినాదంతో ఓటర్లను తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఖాళీ అయిన కాంగ్రెస్, తుప్పు పట్టిన సైకిల్, వాడిపోయిన కమలం.. ఇదీ తెలంగాణలో ప్రతిపక్షాల పరిస్థితి. ఈ లోక్ సభ ఎన్నికల దెబ్బకు ఈ పార్టీలు మూత పడేలా కన్పిస్తున్నాయి.
అయితే.. కొంతమందికి కేసీఆర్ షాక్ ఇచ్చారు. టికెట్ కన్ఫర్మ్ అనుకున్న కొంతమందికి టికెట్లు దక్కలేదు. ఎవరూ ఊహించని విధంగా కొత్త వారికి టికెట్లు దక్కడం, కొందరు సిట్టింగ్‌లకు టికెట్లు కన్ఫర్మ్ చేయడంపై కేసీఆర్ వ్యూహం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు రాజకీయ విశ్లేషకులు.
1. మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి
2. కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్
3. నిజామాబాద్ -కల్వకుంట్ల కవిత
4. జహీరాబాద్ – బి బి పాటిల్
5. ఆదిలాబాదు – నగేష్
6. వరంగల్ – పసునూరి దయాకర్
7. భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
8. నల్గొండ – వేమిరెడ్డి నర్సింహా రెడ్డి
9. చేవెళ్ల – డా. రంజిత్ రెడ్డి
10. ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
11. నాగర్ కర్నూల్ – పి రాములు
12. మహబూబాబాద్ – మాలోతు కవిత
13. పెద్దపల్లి – బోర్లకుంట వెంకటేశ్
14. మల్కాజిగిరి – మర్రి రాజశేఖర్ రెడ్డి
15. మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
16. సికింద్రాబాద్ – తలసాని సాయి కిరణ్ యాదవ్
17. హైదరాబాద్ – పుస్తె శ్రీకాంత్