అల్లు అర్జున్ హోళీ సంబరాలు.. వైరల్ అవుతున్న పిక్స్..!

బుధవారం మొదలైన హోళీ సంబరాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు మన పర బేధాలు లేకుండా అందరు హోళీ సంబరాలు చేసుకున్నారు. యువత ఈ హోళీ సంబరాల్లో ముఖ్యంగా పాల్గొంటుంది. ఇక సెలబ్రిటీస్ కూడా హోళీ వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన హోళీ వేడుకలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హలతో హోళీ జరుపుకున్న బన్ని ఫ్యామిలీతో సంతోషంగా హోళీ జరుపుకున్నారు.

ఈ సంబరాల్లో మెగా డాటర్ నిహారిక కూడా బన్నితో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ఈ పిక్స్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. బన్ని అండ్ ఫ్యామిలీ జరుపుకున్న ఈ హోళీ సంబరాలు చూసి అందరు సంబరపడుతున్నారు. పండుగ ఏదైన సెలబ్రిటీస్ ఆ పండుగలో పాల్గొంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది.