సాధార‌ణ ప‌రిస్థ‌తి.. దేశంలో నేడు కొత్త‌గా 25,920 వేల‌ క‌రోనా కేసులు

-

దేశంలో సాధార‌ణ పరిస్థితిలు నెల‌కొంటున్నాయి. రోజు రోజుకు క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల‌ల్లో దేశ వ్యాప్తంగా 25,920 కరోనా కేసులు వెలుగు చూశాయి. అంటే.. గురు వారంతో పోలిస్తే.. 4,837 క‌రోనా కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. దీంతో దేశం థ‌ర్డ్ వేవ్ నుంచి గ‌ట్టేక్కుతుంద‌ని తెలుస్తుంది. కాగ క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ గ‌తంలో క‌న్న త‌క్కువ వ్యాప్తి ఉంది.

కాగ దేశ వ్యాప్తంగా ఈ రోజు 492 మంది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మృతి చెందారు. మ‌ర‌ణాలు కూడా దేశంలో రోజు రోజుకు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అంద‌రూ వ్యాక్సిన్ లు తీసుకోవడం వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య తక్కువగా న‌మోదు అవుతుంది. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 66,254 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు.

దీంతో ప్ర‌స్తుతం దేశంలో 2,92,092 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ దేశంలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు.. 2.07 శాతం గానే న‌మోదు అవుతుంది. అలాగే వ్యాక్సినేషన్ ప్ర‌క్రియా కూడా వేగ వంతంగా సాగుతుంది. నేటి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా.. 1,74,64,99,461 డోసుల‌ను కేంద్ర ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news