బ‌ర్డ్ ఫ్లూ భ‌యం.. 25 వేల కోళ్ల‌ను చంపాల‌ని మ‌హారాష్ట్ర స‌ర్కార్ ఆదేశం

-

మ‌హారాష్ట్ర రాష్ట్రంలో బ‌ర్డ్ ప్లూ భ‌యం వెంటాడుతూనే ఉంది. థానే జిల్లాలోని షాహాపూర్ త‌హ‌సీల్దార్ ప‌రిధిలోని వెహ్లులి గ్రామంలోని కోళ్ల ఫారంలో 100 కోళ్లు ఆక‌స్మికంగా మృతి చెందాయి. బ‌ర్డ్ ప్లూతో కోళ్లు మ‌ర‌ణించాయ‌నే భ‌యంతో వ్యాధి నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని థానే జిల్లా క‌లెక్ట‌ర్ రాజేష్ జె న‌ర్వేక‌ర్ జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

మ‌ర‌ణించిన కోళ్ల యొక్క నమూనాల‌ను ప‌రీక్ష కోసం పూణే ప్ర‌యోగ‌శాల‌కు పంపించారు. బ‌ర్డ్ ప్లూ ప్ర‌బ‌ల‌కుండా నియంత్రించ‌డానికి 25వేల కోళ్ల‌ను చంపాల‌ని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. థానే జిల్లాలో ఏవీఎన్ ఇన్ ప్లూ ఎంజా కార‌ణంగా ప‌క్ష‌లు చ‌నిపోయిన‌ట్టు ప‌రీక్ష‌లకు సంబంధించిన ఫ‌లితాలు వెల్ల‌డించాయ‌ని థానే జిల్లా ప‌రిష‌త్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ భౌసాహెబ్ దంగ్డే చెప్పారు. థానే జిల్లాలో బ‌ర్డ్ ప్లూ కేసుల‌ను గుర్తించ‌డం గురించి కేంద్ర మ‌త్య్స , ప‌శు సంవ‌ర్థ‌క శాఖకు స‌మాచారం అందించాం అని డాంగ్దే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news