ఎక్కువ నీళ్లు తాగితే ఈ ప్రాణాంతకమైన సమస్యలు తప్పవట..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం, సరిపడా నీళ్ళు, కొంచెం సేపు వ్యాయామం,మంచి నిద్ర ఇవన్నీ చాలా ముఖ్యం. అయితే నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. హైడ్రేట్ గా ఉండొచ్చు. దాహం వేసినా ఆకలి వేసినా ఎక్కువ నీళ్లు మనం తాగుతూ ఉంటాము.

 

drinking water

సరిపడా నీళ్లు తీసుకుంటే మంచిదే కానీ దానికి మించి ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కనుక ఎక్కువ నీళ్ళు తీసుకొని అనవసరంగా ఇబ్బందులు పడకండి. శరీరానికి సరిపడా నీళ్ళు కంటే ఎక్కువ నీళ్ళు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి మరి ఇక ఆ సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం.

కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తుంది:

కిడ్నీలు ఒంట్లో ఉండే చెడు పదార్థాలు బయటకు పంపిస్తాయి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల కిడ్నీ ఫంక్షన్ బాగా జరుగుతుంది. అదే ఒకవేళ మీరు ఎక్కువ నీళ్లు తాగారు అంటే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్ళు మాత్రమే తాగండి.

సర్క్యులేటరీ సిస్టం పై ప్రభావం:

ఎక్కువ నీళ్లు తాగడం వల్ల సర్క్యులేటరీ సిస్టం పై కూడా ప్రభావం పడుతుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల బ్లడ్ వెజల్స్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి అధిక మోతాదులో నీళ్లు తాగద్దు.

వికారం కలుగుతుంది:

సరిపడా నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అవకుండా ఉంటుంది. ఓవర్ హైడ్రేషన్ కనుక అయిందంటే వికారం కలుగుతుంది. అలానే డయేరియా, వాంతులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

బ్రెయిన్ ఫంక్షన్ పై ఎఫెక్ట్:

అధికంగా నీళ్లు తీసుకోవడం వల్ల బ్లడ్ ని డైల్యూట్ చేసేస్తుంది. అలానే సోడియం లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. తక్కువ సోడియం లెవెల్స్ ఉంటే సెల్స్ వాచిపోతాయి. దీనితో కోమా, రెస్పిరేటరీ సమస్యలు, చనిపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్ళు మాత్రమే తీసుకోండి అధికంగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news