అమరావతి : ఏపీ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను తాజాగా సవరిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2022 జనవరి నుంచి కొత్త వేతన స్కేళ్లను అమల్లోకి వచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.
11 వ పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలు, పెన్షన్లను నిర్దారిస్తూ ఆదేశాలు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. జనవరి 2022 నెలకు చెల్లించిన వేతనాల్లో హెచ్చుతగ్గులను సవరిస్తామని పేర్కొంది ప్రభుత్వం. అలాగే.. ఫిబ్రవరి 2022 నెలకు సంబంధించిన వేతన, పెన్షన్ బిల్లులను సిద్ధం చేయాలని డీడీఓలకు ఆదేశాలు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్.
దీంతో ఏపీలోని ఉద్యోగులకు.. కొత్త పీఆర్సీ ప్రకారమే.. ఈ నెల జీతాలు రానునన్నాయి. కాగా..ఈ కొత్త పీఆర్సీ పై ఏపీ ఉద్యోగులు.. ఇటీవల సమ్మెకు వెళతానని… ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వంతో.. చర్చల అనంతరం.. ఉద్యోగులు శాంతించారు.