నారాయణఖేడ్ లో రేపు లక్ష మందితో కేసీఆర్‌ బహిరంగ సభ

-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు రేపు సీఎం కేసీఆర్ రానున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు మమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు స్వయంగా పరిశీలించారు. రేపు మద్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలి క్యాప్టర్ ద్వారా జుజాల్ పూర్ వద్ద అనురాధ కాలేజీ ప్రాంగణం సభ స్థలానికి చేరుకోనున్నారు. రేపు లక్ష మందితో నిర్వహించ బోయే సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు.

అలాగే కాళేశ్వరం నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సాగు నీరు దక్కనుంది. 4500 కోట్ల రూపాయల నిధులతో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జహీరాబాద్ , ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గములలో 2.19 లక్షలకు సాగు నీరు అందనుంది. బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆందోల్ , నారాయణఖేడ్ నియోజకవర్గాలకు 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.

గతంలో నారాయణఖేడ్ ప్రాంత భూములలో తొండ్డలు గుడ్డులు పెట్టేవి ఇప్పుడు ఈ భూముల విలువలు పెరిగినయి. సీఎం పర్యటన నేపథ్యంలో 1500 మంది పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 14 మంది డిస్పిలు , 48 సిఐలు, 80 మంది ఎస్సై లు ఇతర సిబ్బంది భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. నారాయణఖేడ్ కు సీఎం రాకతో భారీ ఎత్తున జన సమీకరణ లక్ష్యం గా స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, తెరాసా నాయకులు పని చేస్తున్నారు. సభా స్థలిని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎస్పీ రమణ కుమార్ పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news