బ్రిటన్ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కూడా ఐసోలేషన్ అవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ నిబంధన వచ్చే వారం నుంచి బ్రిటన్ దేశ వ్యాప్తంగా అమలు కానుందని ప్రకటన చేసింది. కాగ ఇటీవల బ్రిటన్ దేశ ప్రభుత్వం.. కొవిడ్ తో సహజీవనం అనే ప్రణాళికలను సిద్దం చేసింది. దీని ప్రకారం.. కరోనా అనేది కేవలం ఫ్లూ లాగే నమ్ముతుంది. ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ టీకాలు తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే కొవిడ్ తో సహజీవనం అనే ప్రణాళికను సిద్దం చేసింది. కాగ దీని పై తమ ప్రభుత్వం అధికారికంగా సోమ వారం పార్లమెంట్ లో ప్రకటన చేస్తామని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా నియంత్రణ పేరుతో ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించలేమని అన్నారు. బ్రిటన్ దేశ ప్రజలు.. తమ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ.. తమ స్వేచ్ఛ భంగం చేసుకోరాని ఆయన అన్నారు.
కాగ బ్రిటన్ దేశంలో.. 12 ఏళ్ల చిన్నారుల నుంచి అర్హలు అందరికీ.. టీకాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం మందికి టీకాలను పంపిణీ చేశారు. టీకాలు వేసుకున్న వారికి కరోనా తో ఎలాంటి ప్రమాదం ఉండదన్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.