కాన్ఫిడెన్స్: కమలం ఖాతాలో ఆ ఐదు సీట్లు?

-

ఇటీవల నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది…నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో బీజేపీ లీడ్‌లో ఉందని ఓ సర్వే తేల్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఇక ఆ సర్వే రిపోర్టుని ఈ మధ్య నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్..తన సోషల్ మీడియాలో పోస్తు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 స్థానాల్లో బీజేపీ ఐదు స్థానాల్లో గెలుస్తుందని, మిగిలిన రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుందని తేలింది.
నిజామాబాద్ అర్బ‌న్, రూర‌ల్, ఆర్మూర్, కోరుట్లతో పాటు బోధ‌న్‌లో కూడా బీజేపీ విజ‌యం సాధిస్తుంద‌ని, అలాగే మిగిలిన రెండు స్థానాల్లో కూడా ఎన్నిక‌ల నాటికి పరిస్థితులు మారే అవ‌కాశం ఉందని సర్వేలో వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని చెప్పి బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు.
మరి ఆ సర్వే ఎంతవరకు నిజం ఉంది…అంటే అక్కడ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడం అంత ఈజీనా..అలాగే కాంగ్రెస్‌ని నిలువరించగలిగే శక్తి బీజేపీకి ఉందా? అనే అంశాలని ఒకసారి చూసుకుంటే..గతంలో నిజామాబాద్‌లో టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది..అలాగే కాంగ్రెస్ సైతం సత్తా చాటేది. ఇక టీఆర్ఎస్ ఎంట్రీతో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయింది…2014 నుంచి నిజామాబాద్‌లో టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే ఫైట్ నడుస్తోంది..ఇందులో టీఆర్ఎస్ పైచేయి సాధిస్తుంది. 2018 ఎన్నికల్లో కూడా అదే జరిగింది…2019 పార్లమెంట్ ఎన్నికలోచ్చేసరికి నిజామాబాద్ పార్లమెంట్‌లో అనూహ్యంగా బీజేపీ గెలిచింది. దీంతో అక్కడ సీన్ మారిపోయింది…పైగా రాష్ట్రంలో నిదానంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ మారింది.
దీంతో నిజామాబాద్‌లో కూడా రెండు పార్టీల మధ్యే హోరాహోరీ ఫైట్ జరిగేలా ఉంది. ఇక ఇటీవల వచ్చిన సర్వేలో బీజేపీ ఆధిక్యం ఉంటుందని తేలింది. కానీ టీఆర్ఎస్‌ని దాటి బీజేపీ లీడ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఏదో ఒకటి, రెండు సీట్లు ఓకే గాని ఏకంగా ఐదు సీట్లు అంటే కష్టమే. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల సమయానికి ఏం అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news