ముఖం మీది మొటిమలు, మృత కణాలు, ముడతలా..? సమస్య ఏదైనా సొల్యూషన్ బీట్ రూట్..!

-

బీట్ రూట్ వలన ఆరోగ్యాన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉన్న పోషకాలు అనేక సమస్యలకు పరిష్కారం ఇస్తాయి. బీట్ రూట్ కేవలం ఆరోగ్యానికే కాదు..అందానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి బీట్ రూట్ తో ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అనే విషయం తెలియదు.. ఇది మొటిమలును నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం బీట్ రూత్ తో ఎన్ని రకాలుగా ఫేస్ ప్యాక్ లు వేసుకోవచ్చో చూద్దాం.
మొటిమలతో బాధపడుతున్నవారు బీట్‌రూట్‌ ప్యాక్‌ను ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది.
రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీది మొటిమలు, వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం కాంతిమంతమవుతుంది. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. అదే విధంగా రోజూ ముఖానికి బీట్‌రూట్‌ రసం రాసి పది నిమిషాలపాటు మర్దన చేస్తే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగి పోతాయి.

బీట్రూట్ బెనిఫిట్స్..

1. స్కిన్ కి నాచురల్ గ్లో వస్తుంది.
2. యాక్నే తగ్గిస్తుంది.
3. స్కిన్ బ్రైట్ గా మారుతుంది.
4. ఫైన్ లైన్స్ పోతాయి.
5. స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది.
6. డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ అవుతాయి.
7. స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది.
8. లిప్స్ కి మంచి పింక్ కలర్ ని ఇస్తుంది.
9. ముఖం మీద మచ్చలు, ముడతలు మాయమవుతాయి.
10. బీట్రూట్ లో ఉండే విటమిన్ సీ వల్ల కొలాజెన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ కూడా మెరుస్తూ కనిపిస్తుంది.

రోజీ గ్లో కోసం..

బీట్రూట్ ని సన్నగా తురమండి. ఈ తురుముని ఫేస్ కి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచండి. చల్లని నీటితో కడిగేసి మీ బుగ్గల మీద చక్కని రోజ్ కలర్ గమనించండి. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయండి. మీ బుగ్గల మీద ఆ రోజ్ టింట్ అలాగే మెయింటెయిన్ అవుతుంది.

మంచి కాంప్లెక్షన్..

ఒక టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. బీట్రూట్ లో ఉండే విటమిన్ సీ కొలాజెన్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ అప్పియరెన్స్ ని కూడా మెరుగు పరుస్తుంది. నిమ్మ రసం స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది. స్కిన్ కి ఈవెన్ టోన్ వచ్చేలా చేస్తుంది.

స్కిన్ బ్రైట్..

ఒక టీ స్పూన్ బీట్రూట్ జ్యూస్ లో రెండు టీ స్పూన్ల కమలా పండు తొక్కల పొడి కలపండి. స్మూత్ పేస్ట్ లా తయారైన తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి. చల్లని నీటితో కడిగేయండి. రోజు విడిచి రోజు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇలా వివిధ సమస్యలు ఉన్నవారు బీట్ రూట్ ను మీ బ్యూటి టిప్ లో ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు..వారానికి ఒకటిరెండు సార్లు బీట్ జ్యూస్ తాగుతూ ఉంటే..స్కిన్ లోపలినుంచి గ్లోయింగ్ అవుతూ వస్తుంది. స్కిన్ కు బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ సూపర్ రిజల్ట్ ఇస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news