చిన్న సారు కళ్ళలో ఆనందం కోసం!

-

ఏంటో మరి ఈ మధ్య పెద్ద సార్ దృష్టి అంతా జాతీయ రాజకీయాలపైనే ఉంది..అసలు తెలంగాణని తాను అద్భుతమైన అభివృద్ధి చేశానని, ఇక దేశాన్ని కూడా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేయాలని చెప్పి హడావిడి చేసేస్తున్నారు.. కేంద్రంలోని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా గళం విప్పి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని ఏకతాటిపైకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసలు మొత్తం దేశ రాజకీయాలపైనే కారు సార్ దృష్టి ఉంది.. అసలు ఇలా కేసీఆర్‌కు సడన్‌గా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి హడావిడి చేయడం వెనుక కారణం ఏంటి? అసలు ఇప్పుడు దేశాన్ని మార్చాలని కేసీఆర్‌కు ఎందుకు ఆలోచన వచ్చిందనే అంశాన్ని చూస్తే.. ఇంతకాలం బీజేపీకి పరోక్షంగా స్నేహహస్తం ఇస్తూ వచ్చిన కేసీఆర్.. సడన్‌గా తెలంగాణలో బీజేపీ రేసులోకి రావడంతో..ఇంకా ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రంలోని బీజేపీనే కాదు.. కేంద్రంలోని బీజేపీని గట్టిగా టార్గెట్ చేశారు.. మోడీ వల్ల దేశమంతా నాశనమైందన్నట్లు కేసీఆర్ చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని ఏకం చేస్తున్నారు.

అసలు దేశం దారి తప్పుతోందని, ఈ మత కల్లోల క్యాన్సర్‌ను నలిపి పారెయ్యాల్సిన అవసరం ఉందని,  జాతీయ రాజకీయాలను తాను ప్రభావితం చేస్తానని, దేశాన్ని రుజుమార్గంలో పెడతానని, తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతానని, దేశాన్ని సెట్‌రైట్‌ చేస్తానని కేసీఆర్ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. అంటే దేశాన్ని రుజుమార్గంలో పెట్టే సత్తా కేసీఆర్‌కు ఉందా? లేదా? అనే విషయం పక్కనబెడితే.. ముందు కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టాలనేది కేసీఆర్ ఆలోచన అని తెలుస్తోంది.

అదే సమయంలో తెలంగాణలో తన తనయుడు కేటీఆర్‌కు లైన్ క్లియర్ చేయాలనే క్రమంలోనే కేసీఆర్.. ఇలా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని చెబుతున్నారని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే నెక్స్ట్ తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్‌ని అధికారంలోకి తీసుకొచ్చి..కేటీఆర్‌ని సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమని అంటున్నారు. ఇక కేంద్రంలో ఏదొకవిధంగా చక్రం తిప్పాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. అంటే చిన్న సారు కళ్ళలో ఆనందం చూడటం కోసమే పెద్ద సారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని అన్నట్లు వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news