ఉక్రెయిన్ లో చిక్కకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ అంశంపై విదేశాంగా శాఖ ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న హంగేరి, రొమేనియా దేశాలతో సంప్రదింపులు జరిపారు. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నిన్న టెలిఫోన్ లో మాట్లాడారు. యుద్ధాన్ని ఆపాలని కోరుతూనే.. ఉక్రెయిన్ లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ విషయాన్ని కూడా తెలియజేశారు.
తాజాగా ఈ రోజు ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది. ఉక్రెయిన్ ఉన్న భారతీయులు హంగరీ, రొమానియా బార్డర్ చెక్ పోస్టులకు చేరుకోవాలని సూచించింది. హంగరీ, రొమేనియా నుంచి భారతీయులను ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. దీని కోసం విదేశాంగ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉజ్హోరోడ్ సమీపంలోని CHOP-ZAHONY హంగేరియన్ సరిహద్దు వద్ద, చెర్నివ్ట్సీకి సమీపంలోని PORUBNE-SIRET రొమేనియన్ సరిహద్దు వద్దకు భారతీయులు చేరుకోవాలని సూచనలు చేసింది. దీంతో పాటు భారతీయులు తప్పకుండా పాస్ పోర్టు, డబ్బును తీసుకుని రావాలిని… అలాగే ప్రతీ వాహనంపై భారత జెండాను పెట్టుకోవాలని సూచించింది. అవకాశం ఉంటే డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకురావాలని సూచించింది. అలాగే విద్యార్థులు, విద్యార్థుల కాంట్రాక్టర్లతో టచ్ లో ఉండాలని సూచించింది.