Breaking news: కేంద్రం కీలక నిర్ణయం… ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ప్రత్యేక దూతలుగా వెళ్లనున్న కేంద్ర మంత్రులు వీరే..

-

రష్యా- ఉక్రెయిన్ పరిణామాల మధ్య కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ప్రత్యేక దూతలుగా కేంద్రమంత్రుల టీంలను పంపనుంది. తాజాగా ఈరోజు ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు విదేశాంగ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. 

తాజాగా ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న హంగేరీ, స్లోవేకియా, పోలాండ్, రొమేనియా దేశాలకు కేంద్ర మంత్రులను ప్రత్యేక దూతలుగా పంపనున్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు మరియు జనరల్ (రిటైర్డ్) VK సింగ్ ఉక్రెయిన్ పొరుగు దేశాలకు భారతదేశం యొక్క ప్రత్యేక దూతలుగా వెళ్లనున్నారు. ఆయా దేశాల నుంచి ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నారు కేంద్ర మంత్రులు.

Read more RELATED
Recommended to you

Latest news