మంత్రి కేటీఆర్ కు కోమటిరెడ్డి బహిరంగ లేఖ

-

మంత్రి కేటీఆర్ కు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చేనేత మిత్ర సబ్సిడీ 6 నెలలుగా రాకపోవటంపై మంత్రి కేటీఆర్ కి లేఖ రాశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికులు పట్టు నూలు కొనుగోలు చేశారని.. 2 నెలలకు ఒక్కసారి అందవాల్సిన సబ్సిడీ 6 నెలలు అయిన అందటం లేదని లేఖలో చెప్పారు.

పట్టు కొనుగోలు చేసి 6 నెలలు గడిచినా వారికి అందవాల్సిన 40% సబ్సిడీ రావడం లేదని… పట్టు నూలు 1 kg 6000కి పెరిగిడంతో మాస్టర్ కార్మికులకు పని కలిపోయించలేక మగ్గాలు బంద్ చేశారని మండిపడ్డారు.

పనిలేక చేనేత కార్మికుల ఇల్లు గడవడం గగనం అయ్యిందని.. కోమటి రెడ్డి వెల్లడించారు. చేనేత కార్మికులు 1kg పట్టు నూలు ధారంను 6000 రూపాయలు పెట్టి మార్కెట్లో కొంటున్నారూ సబ్సిడీ మాత్రం ప్రభుత్వం 4700 రూపాయలకు మాత్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ సమస్య ని పరిష్కరించాలని.. చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news